గిరిజన సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు త్వరలో పోషణ కిట్లు : మంత్రి సంధ్యారాణి - Minister at Tribal Ashram School - MINISTER AT TRIBAL ASHRAM SCHOOL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 30, 2024, 8:01 PM IST
Minister Sandhya Rani Inspects Tribal Girls Ashram School: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొత్తవలస గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో విద్య, మౌలిక వసతులుపై విద్యార్థులను అడిగి తెలిసుకున్నారు. తరగతి గదిలో విద్యార్థులతో ఆంగ్ల పాఠ్యాంశాలను చదివించారు. పాఠశాలలో ఇంగ్లీషు విద్యలో నాణ్యతను పెంచి గిరిజనులకు మంచి మెరిట్ వచ్చేటట్లు చేయాలని ఆమె సూచనలు అందించారు. అనంతరం వంట గదిని పరిశీలించారు.
హాస్టల్‌లో మెనూకు తగ్గట్టు భోజనం లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పోషణ విషయంలో బాధ్యతగా ఉండాలని సూచించారు. పిల్లల వసతుల విషయంలో తప్పు జరిగితే క్షమించేదే లేదని అన్నారు. గిరిజన సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు త్వరలో పోషణ కిట్లు అందిస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. గిరిజన పిల్లలకు మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు.