జిల్లా స్థాయి టోర్నమెంట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కబడ్డీ, కబడ్డీ - వీడియో చూసేయండి - Minister Ponnam Played Kabaddi
🎬 Watch Now: Feature Video
Published : Mar 10, 2024, 2:04 PM IST
|Updated : Mar 10, 2024, 2:38 PM IST
Minister Ponnam Played Kabaddi in Husnabad : యువత చెడు దారి పట్టకుండా క్రీడలు చక్కగా ఉపయోగపడతాయని, శారీరక, మానసిక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కబడ్డీ క్రీడాకారులు మంత్రి పొన్నంకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం క్రీడాకారులతో కలిసి మంత్రి కబడ్డీ ఆడారు. ఈ క్రమంలోనే కూతకు వెళ్లిన పొన్నం ప్రభాకర్ కింద పడ్డారు. తిరిగి లేచి మళ్లీ కబడ్డీ ఆడి, క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. గ్రామాల్లోని యువత చెడు దారి పట్టకుండా గ్రామానికి చెందిన యువకుడు కృష్ణ కబడ్డీ పోటీలను ప్రతి ఏటా నిర్వహిస్తుండటం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. కృష్ణ కబడ్డీ క్లబ్ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహిస్తున్న కృష్ణను అభినందించారు. తాను కూడా చిన్నతనంలో కబడ్డీ ఎక్కువగా ఆడినట్లు, అందుకే క్రీడాకారులతో కలిసి ఇప్పుడు ఆడటం జరిగిందన్నారు.