LIVE సచివాలయం నుంచి మంత్రి నారాయణ మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - Minister Narayana Press Meet Live - MINISTER NARAYANA PRESS MEET LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 18, 2024, 3:09 PM IST
|Updated : Jul 18, 2024, 3:25 PM IST
Minister Ponguru Narayana Press Meet Live: పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ సచివాలయం నుంచి కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు. అంతకుముందు అమరావతి సచివాలయం నుంచి మున్సిపల్ కమిషనర్లతో పురపాలక శాఖ మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ వ్యాధులు, అన్న క్యాంటీన్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు మున్పిపల్ శాఖ డైరెక్టర్ సాయికాంత్ వర్మ, ఇతర విభాగాల ఉన్నత అధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షకు 123 పురపాలికల కమిషనర్లు, ఇతర అధికారులు హాజరయ్యారు. అన్న క్యాంటీన్ల భవన నిర్మాణాల పూర్తిపై అధికారులకు మంత్రి నారాయణ పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధులు అరికట్టడానికి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, చర్యలపై కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా వ్యాధులు ప్రభలించే అవకాశం ఉండటంతో ఆయన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో సచివాలయం నుంచి మంత్రి నారాయణ మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం.
Last Updated : Jul 18, 2024, 3:25 PM IST