మంత్రి గారి శ్రమదానం- స్వయంగా కొడవలి చేతబట్టి పిచ్చి మొక్కల తొలగింపు - YCP Fraud in Tidco Houses - YCP FRAUD IN TIDCO HOUSES

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 7, 2024, 6:08 PM IST

Minister Nimmala Rama Naidu Fires On YCP : తెలుగుదేశం హయాంలో 90 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్లను గత వైసీపీ సర్కార్ పాడు పెట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి తెచ్చిన లోన్ సొమ్ముల్ని ఏంచేశారో తెలియదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు టిడ్కో ఇళ్ల సముదాయంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి  నిమ్మల రామానాయుడు తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేశారు. కాలనీలో ప్రజలు సంచరించడానికి వీలు లేకుండా అడివిలా పెరిగిన పిచ్చి మెుక్కలను, మట్టి గుట్టలను తొలగించారు. మంత్రి స్వయంగా కొడవలి,గునపం చేతపట్టి శ్రమదానం చేయడంతో, స్థానికుల్లోను ఉత్సాహం వెల్లువిరిసింది. 

అనంతరం ఆయన మాట్లాడుతూ, టీడీపీ హయాంలో ఎంతో కష్టపడి రెండు సంవత్సరాల్లో 90 శాతం ఇళ్లను పూర్తి చేశామని తెలిపారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిపై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాలేదని విమర్శించారు. అంతేగాక టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లను బ్యాంకులకు తాకట్టు పెట్టి ఒక్కొక్కరి నెత్తిన 3 లక్షల 80 వేలు భారం మోపారని మండిపడ్డారు. కేవలం పాలకొల్లు నియోజకవర్గంలోనే ఉన్న టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి దాదాపు 180 కోట్ల రూపాయాలు జగన్ తన అకౌంట్​లోకి తరలించుకున్నారని విమర్శించారు. మెుత్తం రాష్ట్రవ్యాప్తంగా చూస్తే దాదాపు 8వేల కోట్లు అక్రమంగా సొంత ఖాతాలకు మళ్లీంచుకున్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.