పెంపుడు జంతువులను రోడ్లపై వదిలేస్తే జరిమానా విధిస్తాం: మంత్రి నారాయణ - FINE ON PET ANIMALS - FINE ON PET ANIMALS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2024, 7:39 PM IST
Minister Narayana Warned Pets Not left on Roads : పట్టణాలు, నగరాల్లో రోడ్లపైకి పశువులు, పెంపుడు కుక్కలను వదిలితే కఠిన చర్యలు తప్పవని పురపాలక శాఖ మంత్రి నారాయణ హెచ్చరించారు. పశువులు, కుక్కలు రోడ్లపైకి రావడం వల్ల వాహనదారులు, నడిచి వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పెంపుడు జంతువులను రోడ్లపైకి వదలకుండా యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రోడ్లపై పశువులు, పెంపుడు కుక్కలు తిరుగుతుంటే మున్సిపాలిటీకి తరలించి యజమానులకు జరిమానా విధిస్తామని మంత్రి పేర్కొన్నారు.
15 రోజుల్లోగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో రోడ్లపై పశువుల సంచారం లేకుండా చేయాలని అందుకు తగినట్లుగా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. సెప్టెంబర్ చివరి నాటికి రోడ్లపై పందులు తిరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. వీధి కుక్కలకు త్వరితగతిన స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేయించడంతోపాటు పెంపుడు కుక్కలు వీధుల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కుక్కలు చిన్న పిల్లలు, ఒంటరిగా వెళ్తున్న మహిళలు, వృద్దులపై దాడి చేసిన ఘటనలు చూస్తున్నాం. ఇకపై అలాంటివి జరగకుండా ఉండేందుకు పురపాలక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.