కేంద్రమంత్రి ప్రకటన నీలి మీడియాను నిరాశ పరిచింది: మంత్రి లోకేశ్ - Nara Lokesh Thanks to Kumaraswamy

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 10:49 PM IST

thumbnail
కేంద్రమంత్రి ప్రకటన నీలి మీడియాను నిరాశ పరిచి ఉండొచ్చు: మంత్రి లోకేశ్ (ETV Bharat)

Minister Nara Lokesh Thanks to Union Minister Kumaraswamy: ఎవరు పెద్ద మోసగాళ్లు అనే రేసులో వైఎస్ జగన్, నీలి మీడియా ఒకరికి ఒకరు పోటీ పడుతుంటారని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్​ మండిపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదంటూ కేంద్ర మంత్రి కుమారస్వామి చేసిన ప్రకటన మన ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తే నీలి మీడియాను నిరాశ పరిచి ఉండొచ్చని దుయ్యబట్టారు. తప్పుడు వార్తలు, అసత్య కథనాలతో నీలి మీడియా రాష్ట్రంలో అశాంతి సృష్టించే కుట్రలను మంత్రి కుమారస్వామి ప్రకటన భగ్నం చేసిందన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను నిలబెట్టి, విశాఖను కాపాడిన కేంద్ర మంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల అంకితభావంతో ఉన్నాయని స్పష్టం చేశారు. తమది ప్రజా ప్రభుత్వం అని ప్రజల అంచనాలను అందుకోవడమే తమ ప్రాధాన్యమని తేల్చిచెప్పారు. జగన్‌కు, నీలి మీడియాకు రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పారని ఈ హెచ్చరికను వారు పట్టించుకోకపోతే, 2029లో మరింత ఘోరమైన ఓటమిని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ప్రజలు తప్పుడు వార్తలు, నకిలీ కథనాలను, మోసపూరిత విధానాలను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.