వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలను బయటకు తీస్తున్నాం: మంత్రి లోకేశ్ - Nara Lokesh Opened Anna Canteens
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 16, 2024, 10:12 AM IST
Minister Nara Lokesh Anna Canteens Were Opened: రాష్ట్రంలో అన్నక్యాంటీన్లు పునఃప్రారంభమవుతున్నాయి. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన సొంత నియోజవర్గంలో రెండు చోట్ల అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని నులకపేటలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి పేదలకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. అనంతరం మంగళగిరిలో మరో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి స్థానికులతో కలసి మంత్రి లోకేశ్ అల్పాహారం సేవించారు. ఏ ప్రభుత్వం వచ్చినా క్యాంటీన్ కొనసాగేలా శాశ్వత నిధి ఏర్పాటు చేస్తామని లోకేశ్ పేర్కొన్నారు. ప్రజల విరాళాలతో అన్న క్యాంటీన్లు శాశ్వతంగా కొనసాగుతాయన్నారు. అన్న క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారం, భోజనం అందిస్తున్నారు. ఆనాడు రాళ్లు, పాసు పుస్తకాలపై జగన్ ఫొటోలకు పెట్టిన ఖర్చుతో ఐదేళ్లు అన్న క్యాంటీన్లు నిర్వహించవచ్చన్నారు
Nara Lokesh Comments on YSRCP: చట్టాలు ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయడం తప్పా అని మంత్రి లోకేశ్ ప్రశ్నించారు. జోగి రమేష్ కుమారుడు చట్టాలు ఉల్లంఘించి భూములు కొనలేదా? వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను ప్రస్తుతం బయటకు తీస్తున్నామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. వర్సిటీల్లో త్వరలోనే ఉప కులపతులను నియమిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఎన్నికల హామీ మేరకు మంగళగిరిలో గోల్డ్ హబ్ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. నియోజకవర్గంలో భూగర్భ విద్యుత్ కేబుళ్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ వివరించారు.