కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి మేరుగు నాగార్జున - స్వల్ప గాయాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 25, 2024, 8:21 PM IST
Minister Nagarjuna Injured in Adudam Andhra Program : ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జునకు స్వల్పగాయం అయ్యింది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కబడ్డీ ఫైనల్స్‌ను మంత్రి నాగార్జున ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అక్కడి ఉన్న యువ క్రీడాకారులతో కబడ్డీ ఆట ఆడారు. మంత్రి నాగార్జున కబడ్డీ, కబడ్డీ అంటూ కూతకు వెళ్లి అదుపు తప్పి కింద పడిపోయారు. దీంతో ఆయన ఉంగరపు వేలుకు స్వల్పగాయం అయ్యింది.
Minister Transfer to Hospital for Treatment : మంత్రి నాగార్జునకు స్వల్ప గాయం కావడంతో అక్కడ ఉన్న పోలీస్ అధికారులు అప్రమత్తం అయ్యారు. గాయపడ్డిన మంత్రిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మంత్రికి ప్రాథమిక చికిత్సను అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో మంత్రికి గాయం అవ్వడం బాధాకరమని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.