రెండేళ్లుగా రాని జీతాలు - 24 గంటల్లో పరిష్కారం చూపిన మంత్రి లోకేశ్ - lokesh Prajadarbar
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 13, 2024, 7:42 AM IST
|Updated : Jul 13, 2024, 4:22 PM IST
Minister Lokesh Solve BT College Staff Problem in Prajadarbar : అన్నమయ్య జిల్లా మదనపల్లి బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది సమస్యకు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ 24 గంటల్లో పరిష్కారం చూపారు. గత రెండేళ్లుగా తమకు జీతాలు ఇవ్వట్లేదంటూ ప్రజాదర్బార్ లో అధ్యాపకులు లోకేశ్‌కు వినతిపత్రం ఇచ్చారు. గత ప్రభుత్వం సాంకేతిక సమస్యను చూపుతూ రెండేళ్ల నుంచి జీతాలు ఇవ్వలేదని వాపోయారు. ప్రజాదర్బార్ సమయం ముగిశాక వచ్చినప్పటికీ వారి నుంచి వినతి పత్రం స్వీకరించిన మంత్రి లోకేశ్, సమస్య సత్వర పరిష్కారానికి హామీ ఇచ్చారు.
అధ్యాపకులకు తక్షణమే జీతాలు చెల్లించేలా సంబంధిత శాఖకు లోకేశ్ ఉత్తర్వులు జారీ చేయించారు. 24 గంటల్లోనే సమస్యకు పరిష్కారం చూపుతూ అధ్యాపకుల చేతికి ఆర్డర్ పత్రాలు అందాయి. అధ్యాపకుల సమస్యను ఈటీవీ, ఈటీవీ భారత్ వెలుగులోకి తీసుకొచ్చింది. బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు లోకేశ్‌కు, ఈటీవీ, ఈటీవీ భారత్‌కి కృతజ్ఞతలు తెలిపారు.
మదనపల్లె బీటీ డిగ్రీ కళాశాల సిబ్బంది సమస్య పరిష్కారమైంది. 23 నెలలుగా నియామక ఉత్తర్వులు, జీతాలు ఇవ్వకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేధించింది. ప్రజాదర్బార్‌లో నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యను పరిష్కరించాం. ఆగమేఘాలపై 32 మందికి నియామక ఉత్తర్వులు అందజేశారు.దూరప్రాంతాల నుంచి వచ్చి నన్ను కలవాల్సిన అవసరం లేదు. మీ సమస్యలు నా మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in పంపించండి. సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా_ లోకేశ్, విద్య, ఐటీ శాఖ మంత్రి