కృత్తివెన్ను రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా- కుటుంబానికి రూ 5లక్షలు - Kollu Ravindra Announced Ex Gratia - KOLLU RAVINDRA ANNOUNCED EX GRATIA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 14, 2024, 4:32 PM IST
Minister Kollu Ravindra Announced ExGratia to Kruthivennu accident Victims : కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు 5 లక్షల పరిహారం ప్రకటించారు. తెల్లవారుజామున కృత్తివెన్ను వద్ద కంటైనర్, మినీ వ్యాన్ ఢీకొని ఆరుగురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Six dead 5 injured in AP road accident : ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 5లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి వెల్లడించారు. మొత్తాన్ని ఈ రోజు సాయంత్రంలోగా అందజేస్తామన్నారు. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల కొల్లు రవీంద్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.