ఓడరేవుల ఆధునీకరణకు రూ.27 వేల కోట్లు- మంత్రి జనార్దన్‌రెడ్డి సమీక్ష - minister review on ports
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 14, 2024, 8:46 AM IST
Minister Janardhan Reddy Review on Ports : రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఓడరేవుల్ని 27 వేల కోట్ల రూపాయలతో అధునీకరణ, సామర్ధ్యం పెంపుపై ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ఆధునీకరణ విస్తరణపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనశాఖ నిర్ణయించింది. ఈ అంశంపై అధికారులతో ఆ శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
నాలుగు ప్రధాన ఓడరేవుల ఆధునీకరణ, సామర్ధ్యం పెంపుపై ప్రణాళికను రూపొందించటం ద్వారా రాష్ట్రంలో పోర్టు ఆధారిత ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి అయ్యేలా చూడాలని ప్రభుత్వం యోచిస్తోంది. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌తోపాటు నాలుగు పోర్టులను అనుసంధానిస్తూ రహదారి మార్గాలు, వివిధ ప్రాజెక్టులు, పోర్టులకు సమీపంలో అనుబంధ లాజిస్టిక్ కారిడార్‌ల నిర్మాణం లాంటి ప్రాజెక్టులను ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయించారు. సమీక్షకు పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ కార్యదర్శి సురేష్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తదితరులు హాజరయ్యారు.