సాలూరులో మంత్రి సంధ్యారాణి ఆకస్మిక తనిఖీ- మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహం - Sandhya Rani Fires Prasanna Vani - SANDHYA RANI FIRES PRASANNA VANI

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 20, 2024, 5:45 PM IST

Minister Sandhya Rani Fires on Commissioner Prasanna Vani : పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘం కార్యాలయంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని మరుగుదొడ్లకు మరమ్మతుల చేపట్టకపోవటంతో కమిషనర్‌ ప్రసన్న వాణిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపేర్లు చేయించాలని అదేవిధంగా నీటివసతి కల్పించాలని చెప్పి ఐదు రోజులవుతున్నా ఎందుకు చేపట్టలేదని మంత్రి సంధ్యారాణి ప్రశ్నించారు. 

Sandhya Rani Inspected Salur Municipal Office : ఇక్కడ కౌన్సిలర్లను అడిగితే ఇంకా పనులు కాలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా మరమ్మతులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ మేరకు కమిషనర్ ప్రసన్న వాణిని మంత్రి సంధ్యారాణి ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆమె సందర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం, ఉన్నత పాఠశాలను బాలికల కళాశాలగా మార్చే దిశగా త్వరలోనే ప్రయత్నం చేస్తానని సంధ్యారాణి హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.