సాంఘిక సంక్షేమ శాఖను సంక్షోభంలోకి నెట్టేశారు : మంత్రి డోలా - Dola Veeranjaneya Swamy press meet
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 18, 2024, 4:24 PM IST
Minister Dola Veeranjaneya Swamy Press Meet : వైఎస్సార్సీపీ హయాంతో సాంఘీక సంక్షేమ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖామంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఆరోపించారు. ఆ శాఖకు కేటాయించిన నిధులు ఏమయ్యాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. సాంఘీక సంక్షేమ వసతి గృహాల్లో వసతులు లేవు. విద్యార్థులకు మెనూకు సంబంధించిన బిల్లులు అందటం లేదని మండిపడ్డారు. వీటన్నింటినీ పరిష్కరించడం తమ ముందున్నా పెద్ద సవాలనీ రాష్ట్ర సాంఘీక సంక్షేమ, వికలాంగుల, వృధ్దులు, సచివాలయాల శాఖామంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు.
ప్రకాశం జిల్లా తూర్పు నాయుడు పాలెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా విద్యార్థుల వసతి గృహాలు నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. ప్రస్తుతం వాటిని మెరుగు పరచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదే విధంగా గత ప్రభుత్వం రద్దు చేసిన పథకాలను కూడా పునరుద్దరిస్తామని హామి ఇచ్చారు. అలాగే వాలంటీర్లపై సరైన నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల ముందు రాజీనామా చేసిన వేలాది మంది నుంచి ప్రస్తుతం వినతులు వస్తున్నాయని వెల్లడించారు. వైసీపీ నాయకులు బలవంతంగా తమను రాజీనామా చేయించినట్లు వాలంటీర్లు తెలిపాారని గుర్తుచేశారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పింఛన్లు జూలై నుంచే అమలు చేస్తామని స్పష్టం చేశారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి డోలా వీరాంజనేయస్వామి తెలిపారు.