రాష్ట్రంలో లేని పార్టీకి అధ్యక్షురాలిగా షర్మిలను నియమించడం హాస్యాస్పదం : మంత్రి అమర్‌నాథ్
🎬 Watch Now: Feature Video
Minister Amarnath Criticized YS Sharmila : రాష్ట్రంలో లేని కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షురాలు పేరిట షర్మిలను నియమించడం హాస్యాస్పదమని, అసలు ఆ పార్టీ గురించి రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? అని ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. షర్మిల మాట్లాడిన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఎవరికో లాభం జరుగుతుందనుకోవటం హాస్యాస్పదం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం పై మంత్రి అమర్‌నాథ్ (Minister Amarnath) సెటైర్లు వేశారు.
ఏపీలో అసలు కాంగ్రెస్ అంటూ లేదని, లేని పార్టీకి చీఫ్ ఎవరైతే తమ కెందుకని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టి ఏపీకి తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 0.4 శాతం ఓట్లతో నోటా కంటే తక్కువవగా పోలయ్యాయని గుర్తు చేశారు. ఒకే కుటుంబం నుంచి వచ్చిన అన్నా చెల్లెళ్లు రెండు పార్టీలకు అధ్యక్షులుగా ఉండడంపై ఆయన స్పందిస్తూ రాజకీయాల్లో అన్నదమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లు వేర్వేరూ పార్టీలో ఉండడం సహజమని అన్నారు.