రోడ్డుపై మిల్క్ ట్యాంకర్ బోల్తా - బకెట్లతో ఎగబడ్డ ప్రజలు - Milk Tanker Overturned - MILK TANKER OVERTURNED
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 9, 2024, 9:09 PM IST
Milk Tanker Overturned in Telangana : పాల ట్యాంకర్ బోల్తా పడటంతో వాటిని పట్టుకునేందుకు బకెట్లతో జనం ఎగబడ్డ ఘటన తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది. నందిపాడు బైపాస్ వద్ద అద్దంకి - నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై పాలతో వెళ్తున్న మినీ పాల ట్యాంకర్ బోల్తా పడింది. కూడలిలో స్పీడ్ బ్రేకర్లను గమనించకుండా వాహనాన్ని డ్రైవర్ వేగంగా నడపటంతో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ట్యాంకర్ ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో పాటు వెనుక ఉన్న పాల ట్యాంకర్ పగిలిపోయింది.
ట్యాంకర్ పగలడం వల్ల చాలా వరకు పాలు నేలపాలు కాగా మిగిలిన పాలను బకెట్లు, బాటిళ్లతో పట్టుకునేందుకు స్థానికులు పోటీ పడ్డారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.