సమ్మక్క తల్లి ఆగమనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి : మంత్రి సీతక్క - Sitakka news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-02-2024/640-480-20813737-thumbnail-16x9-medaram.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Feb 22, 2024, 3:44 PM IST
Medaram Sammakka Saralamma Jatara 2024 : సమ్మక్క - సారలమ్మల నామస్మరణతో గిరిజన జనజాతర మేడారం పులకించిపోతోంది. కోట్లాది భక్తులు తమ ఇలవేల్పులకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారాలు సమర్పిస్తున్నారు. అశేష జనవాహినికి అభయమిచ్చేందుకు సమ్మక్క తల్లి రానున్న వేళ గద్దె వద్ద అలంకరణ పూర్తైంది. చిలకల గుట్ట నుంచి దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా డోలు వాద్యాలు, గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఊరేగింపుగా తీసుకురానున్నారు.
Sitakka In Medaram : మేడారం జాతరను ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ కుంభమేళాగా మంత్రి సీతక్క వర్ణించారు. దేశంలో జరిగే కుంభమేళా కిలోమీటర్ల పొడవైన నదిలో 12 రోజులు సాగుతుందని మేడారంలో కేవలం 4 రోజుల్లోనే కోట్లాది మంది భక్తులు తరలి వస్తారని వెల్లడించారు. సమ్మక్క తల్లి ఆగమనానికి వీలుగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని సీతక్క తెలిపారు. రేపు ఉదయం గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు వనదేవతలు దర్శనానికి వస్తున్నట్లు మంత్రి సీతక్క వివరించారు.