సెంచరీ కొట్టిన 'మార్వాడీ శిక్షా సమితి' - ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం - మార్వాడీ శిక్ష సమితి ఉత్సవాలు
🎬 Watch Now: Feature Video
Published : Feb 12, 2024, 11:22 AM IST
Marwadi Shiksha Samiti Centenary Celebrations in Hyderabad : మార్వాడీ శిక్షా సమితి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘం అధ్యక్షుడు షీల్ కుమార్ సొసైటీ లోగో, పేరును ఆవిష్కరించారు. పేద విద్యార్థులకు మంచి ప్రమాణాలతో విలువైన విద్యను అందించడంలో సంస్థ ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. విద్యార్థులు అన్ని విషయాలను నేర్చుకోవాలని సూచించారు. ఇప్పటి నుంచే బాధ్యతలను పెంచుకొని, భవిష్యత్తుకు మంచి దారిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సమితి కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి కిశోర్ కుమార్, డైరెక్టర్లు, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Marwadi Shiksha Samiti 100 Years Celebrations : ఈ మార్వాడీ శిక్షా సమితి 1924లో స్థాపించబడింది. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.