గుడ్లూరు ఎస్సై వేధింపులు - వ్యక్తి ఆత్యహత్య - స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన - Market Committee Employee Suicide - MARKET COMMITTEE EMPLOYEE SUICIDE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 3:37 PM IST
Market Committee Employee Suicide due to Gudluru SI Harassment : ఎస్సై అనవసరంగా కొట్టడాన్ని మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. గుడ్లూరు మండలం గుళ్లపాలెంలో సురేష్ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గుడ్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో విధులు నిర్వహిస్తున్న సురేష్‌పై ఎస్సై లక్ష్మణ్ చేయి చేసుకున్నారు. బియ్యం లారీల గురించి చెప్పాలని గత కొంత కాలంగా ఎస్సై వేధిస్తున్నారని సురేష్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్నారు.
సురేష్‌ను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి తన ద్వి చక్ర వాహనం, ఫోన్‌ను ఎస్సై లక్ష్మణ్ వద్ద పెట్టుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్సై వేధింపులు తట్టుకోలేక మనస్థాపంతో సురేష్ ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. గుడ్లురు పోలీస్ స్టేషన్ ముందు సురేష్ మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. ఎస్ఐ లక్ష్మణ రావు అతి ప్రవర్తనతో నిండు ప్రాణం పోయిందని బాదితులు ఆందోళన చేస్తున్నారు. ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేశారు. స్టేషన్లో ఎస్ఐ లేకపోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.