హెల్త్ బాలేదని '108'కు కాల్ - కట్‌చేస్తే లిక్కర్ కొనడానికి అంబులెన్స్‌లో 'వైన్‌షాప్'కు - Man Used 108 For Wine - MAN USED 108 FOR WINE
🎬 Watch Now: Feature Video
Published : Jun 12, 2024, 11:52 AM IST
Man Used Ambulance to Buy Wine : అత్యవసర సేవల కోసం ఉపయోగించుకోవాల్సిన 108 అంబులెన్స్‌ను కొందరు దుర్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి మద్యం కొనుగోలు చేయడానికి ఏకంగా అంబులెన్స్ ఉపయోగించుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్‌లో చోటు చేసుకుంది. ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్‌నకు చెందిన శంకర్ ఆరోగ్యం బాలేదంటూ 108కు ఫోన్ చేశాడు. సిబ్బంది వచ్చి అతన్ని బోధన్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి ఓపీలో వైద్య సిబ్బంది పేరు నమోదు చేసుకుని డాక్టర్ కొద్ది సేపటిలో వస్తారు కూర్చోమని చెప్పారు.
ఈ క్రమంలో సిబ్బంది తమ పనులలో ఉండగానే శంకర్ మెల్లగా ఆసుపత్రి నుంచి కొద్ది దూరంలో ఉన్న వైన్ షాప్‌కు జారుకున్నాడు. అటువైపు వెళుతున్న 108 సిబ్బందికి వైన్ షాప్ వద్ద శంకర్ కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. కాళ్ల నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన అతను వైన్ షాపులో మద్యం కొనుగోలు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర సేవలను ఈ విధంగా దుర్వినియోగం చేయడం క్షమించరాని నేరమని స్థానికులు మండిపడ్డారు.