ప్రాణం తీసిన ఫోన్ సంభాషణ - భవనంపై నుంచి జారిపడి వ్యక్తి మృతి - భవనంపై నుంచి జారిపడి వ్యక్తి మృతి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 10:02 AM IST
Man Died Due To Fall On Building: లాడ్జి భవనం (Lodge Building) పై నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా చీరాలలో చోటు చేసుకుంది. మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన కరుణ్ కుమార్ (40)గా గుర్తించారు. పోలీసులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం భీమవరంలో వ్యవసాయ శాఖలో అటెండర్‌గా (Attender in Agriculture Department) పని చేస్తున్న కరుణ్ కుమార్ వేటపాలెంలో ఈరోజు తనపై అధికారి ఇంట్లో జరిగే శుభకార్యానికి హజరైయ్యేందుకు స్నేహితులతో కలిసి చీరాలలోని సాయికృష్ణ లాడ్జిలో రూమ్ తీసుకున్నారు.
Accidently Slipped While Talking On Phone: ఈరోజు తెల్లవారుజామున ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి జారి పడి తీవ్రగాయాలతో మృతి చెందినట్లుగా మృతుని స్నేహితులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.