విభజన హామీలపై త్వరగా నిర్ణయం తీసుకోండి - కేంద్ర హోంశాఖ అధికారులకు మల్లురవి విజ్ఞప్తి - congress
🎬 Watch Now: Feature Video
Published : Jan 29, 2024, 8:15 PM IST
Mallu Ravi Met With Officials of Union Home Department : దిల్లీలో కేంద్ర హోంశాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి మర్యాదపూర్వకంగా కలిశారు. విభజన సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఆస్తి పంపకాలపై చర్చించారు. అంగీకార పత్రాలను హోంశాఖ అధికారులకు అందజేసిన మల్లురవి, వీటిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేంద్రం ఆమోదిస్తే దిల్లీలో తెలంగాణ భవన్ ఏర్పాట్లు ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా ఎన్డీఆర్‌ఎఫ్ నిధులపై హోంశాఖ అదనపు కార్యదర్శితో చర్చించినట్లు మల్లు రవి తెలిపారు.
Mallu Ravi Appoint as Special Representative in Delhi : దిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా ఆదివారం మల్లు రవి బాధ్యతలు చేపట్టారు. దిల్లీలో తనను తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. తనకు ఉద్యోగం వచ్చినట్లు అనుకోవడం లేదని, తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నట్లు మల్లు రవి పేర్కొన్నారు. తనపై నమ్మకం, పని చేసే సమర్థత గుర్తించే సీఎం రేవంత్ రెడ్డి తనకు ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారన్నారు.