రాష్ట్రాభివృద్ధి జరగాలంటే వైఎస్సార్సీపీ పాలన పోవాలి: మాదిగ సంఘాల జేఏసీ - Madiga Communities JAC Meeting - MADIGA COMMUNITIES JAC MEETING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 21, 2024, 7:38 PM IST
Madiga Communities JAC Meeting: రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, యువతకు ఉపాధి, ఉద్యోగాలు రావాలన్నా వైఎస్సార్సీపీ పాలన పోవాలని మాదిగ సంఘాల జేఏసీ నాయకులు అన్నారు. విజయవాడలో మాదిగ సంఘాల జేఏసీ సమావేశాన్ని నిర్వహించారు. జగన్ ఐదేళ్ల పాలనలో 27 ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దు చేశారని జేఏసీ నాయకులు ఆరోపించారు. సబ్ ప్లాన్ నిధులను ఇతర పథకాలను మళ్లించి ఎస్సీలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దళిత సంక్షేమాన్ని విస్మరించిన సీఎం జగన్‌కు దళితులు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణపై కూటమి చిత్తశుద్ధితో ఉందని, ఎన్నికల్లో మాదిగలంతా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
"రాష్ట్రాభివృద్ధి జరగాలంటే వైఎస్సార్సీపీ పాలన పోవాలి. ఐదేళ్ల పాలనలో జగన్ 27 ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దు చేశారు. సబ్‌ప్లాన్ నిధులను మళ్లించి ఎస్సీలకు అన్యాయం చేశారు. ఎస్సీ వర్గీకరణపై కూటమి చిత్తశుద్ధితో ఉంది. ఎన్నికల్లో మాదిగలంతా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలి." - మాదిగ సంఘాల జేఏసీ నేతలు