పెట్రోల్ బంకులో లారీ దగ్ధం- తృటిలో తప్పిన పెనుప్రమాదం - LORRY CAUGHT FIRE AT PETROL STATION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 3, 2024, 4:17 PM IST
Lorry Caught Fire at Dewan Cheruvu Petrol Station in Rajamahendravaram: పెట్రోల్ బంక్లో భారీగా మంటలు వ్యాపించి లారీ దగ్ధం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే దివాన్ చెరువు వద్ద ఉన్న పెట్రోల్ బంకులోకి వచ్చిన లారీ క్యాబిన్లో షార్ట్ సర్క్యూట్ అయింది దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో పెట్రోల్ బంక్ సిబ్బంది, వాహనదారులు భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలానికి సకాలంలో చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అక్కడ ఎవరికీ ఎలాంటి అపాయం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గుజరాత్ నుంచి టైల్స్ లోడుతో తుని వచ్చిన లారీ తిరిగి విజయవాడ వెళ్తూ దివాన్ చెరువు పెట్రోల్ బంకు వద్ద ఆగింది. ఆ సమయంలో ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం కారణంగా లారీ క్యాబిన్ పాక్షికంగా దగ్ధమైంది.