5సంవత్సరాలుగా ఆగిపోయిన అభివృద్ధిని పునఃప్రారంభిస్తాం-లోకేష్
🎬 Watch Now: Feature Video
Lokesh Announced Special SEZ Will Arrange In Mangalagiri For Gold Jewellery: దక్షిణాది రాష్ట్రాల్లో బంగారం ఆభరణాల కోసం గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రత్యేక సెజ్ (Special Economic Zone) ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. మంగళగిరి ఎల్ఈపీఎల్ అపార్ట్మెంట్ వాసులతో లోకేష్, గుంటూరు తెలుగుదేశం నేత పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Sekhar), జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాస్ (janasena Leader Chillapalli Srinivas) సమావేశమయ్యారు.
అపార్ట్మెంట్ వాసులు అడిగిన ప్రశ్నలకు నారా లోకేష్ సమాధానం చెప్పారు. రాబోయే ఐదేళ్లలో ఆగిపోయిన అభివృద్ధి పనులన్నీ తిరిగి ప్రారంభిస్తామన్న లోకేష్ వెల్లడించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆగిపోయిన అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కించాలంటే 10 ఏళ్లపాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలని అన్నారు. ఇక్కడి యువతకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. ప్రధానంగా శాంతిభద్రలపై దృష్టి పెట్టి అన్ని కులాలు, మతాలను రక్షిస్తామని చెప్పారు. మన యువతకు ఆంధ్రాకు చెందిన పరిశ్రమలలోనే ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామన్నారు. చదువుకుంటున్న యువత రాజకీయాల్లోకి రావాలి అని లోకేష్ కోరారు.