LIVE : లోక్‌సభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - Lok Sabha Session Live 2024
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 10, 2024, 11:03 AM IST
|Updated : Feb 10, 2024, 6:11 PM IST
Lok Sabha Session Live 2024 : ఏ-1 ఏపీలో ముఖ్యమంత్రిగా, ఏ-2 రాజ్యసభలో సభ్యుడిగా కూర్చుని ఉంటే ఎలా అభివృద్ధి సాధించగలమని ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో ప్రశ్నించారు. శుక్రవారం లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన శ్వేతపత్రంపై ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీవీ నరసింహరావు, చరణ్‌సింగ్, ఎం.ఎస్. స్వామినాథన్‌కు భారతరత్న ప్రకటించిన కేంద్రప్రభుత్వానికి రామ్మోహన్ నాయడు ధన్యవాదాలు తెలిపారు.అదే సమయంలో యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమడు నందమూరి తారక రామారావుకు భారతరత్న ప్రకటించాలని తెలుగు ప్రజల తరఫున కోరారు.
ఫిబ్రవరి 9వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు ముగియాల్సి ఉంది. కానీ బడ్జెట్ సమావేశాలు కావడంతో మరో రోజుకు పొడిగించారు. కావున శనివారంతో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. శీతాకాల సమావేశాల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొదటి రెండు రోజుల పాటు జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ జరగింది. పార్లమెంటు ఎన్నికలకు ముందు జరిగే చివరి సమావేశం కావడంతో ఉభయ సభలలోనూ వాడీవేడీ చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా లోక్‌సభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం మీ కోసం.