వైఎస్సార్ జిల్లాలో చిరుత పులి సంచారం - భయాందోళనలో జనం - Leopard Spotted at Gandifort - LEOPARD SPOTTED AT GANDIFORT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 14, 2024, 1:12 PM IST
Leopard Spotted at Gandikota Forest : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట కొట్టాలపల్లె శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. చిరుతను చూసినట్లు అక్కడి గొర్రెల కాపరులు తెలిపారు. వారు పెంచుకుంటున్న నాలుగు మేక పిల్లలను చిరుత కొరికి హతమార్చిందని వాపోయారు. రెండు రోజుల కిందట ముద్దనూరు ఘాట్లో చిరుత సంచారంపై వదంతులు వ్యాపించాయి. అటవీశాఖ అధికారులను ముద్దనూరు వదంతులపై వివరణ కోరగా అలాంటిది ఏం లేదని కొట్టి పారేశారు. ప్రస్తుతం గండికోట అడవుల్లో చిరుత సంచరిస్తూ కనిపించడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గాలి మరల పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు మంగళవారం రాత్రి పని ముగించుకొని గండికోట మీదుగా కొట్టాలపల్లికి వెళుతుండగా చిరుత కనిపించడంతో దాన్ని ఫొటో తీసి సామాజిక మధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ను చూసైనా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మనుషులపై దాడికి దిగకముందే చిరుతను పట్టుకుని జూకు తరలించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.