thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 13, 2024, 5:00 PM IST

ETV Bharat / Videos

రిఫార్మ్ రిఫ్లెక్షన్ - విజయవాడలో క్రిమినల్ చట్టాలపై సదస్సు - New Criminal Laws by Central Govt

Seminar ON New Criminal Laws in vijayawada : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్‌ చట్టాలు ప్రజల హక్కుల్ని హరించేవిగా ఉన్నాయని ప్రముఖ హైకోర్టు న్యాయవాది, ఐలూ అధ్యక్షుడు సుంకరి రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. విజయవాడ బాలోత్సవ్ భవన్‌లో రిఫార్మ్ రిఫ్లెక్షన్ పేరుతో క్రిమినల్ న్యాయ చట్టాలపై సదస్సు నిర్వహించారు. ఏ విధమైన చర్చా లేకుండానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడు కీలక చట్టాలను తీసుకొచ్చిందని రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు. న్యాయస్థానాలకు కాకుండా పోలీసులకు మరిన్ని విశేషాధికారాలు ఇవ్వడం వల్ల ప్రజలు స్వేచ్ఛ, హక్కులు కోల్పోతారని నల్సార్ యూనివర్సిటీకి చెందిన కరణం మురళీ  ఆందోళన వ్యక్తం చేశారు.

సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్రప్రసాద్​ మాట్లాడుతూ  బీజేపీ ప్రభుత్వం పాత చట్టాలను మక్కీకి మక్కిగా కాపీ చేసి పేరు మార్చి కొత్త చట్టాలను తెచ్చిందన్నారు. ఏ విధమైన చర్చ లేకుండానే మూడు కీలకమైన చట్టాలను తెచ్చారని ఆరోపించారు. ప్రజాసంఘాలు, ప్రజల హక్కుల కోసం గళమెత్తే నాయకులను వ్యవస్థీకృతమైన నేరస్థులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను తెచ్చిందని విమర్శించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.