యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన పూజ - పెరిగిన భక్తుల రద్దీ - Rush at Yadadri Temple - RUSH AT YADADRI TEMPLE
🎬 Watch Now: Feature Video
Published : Jun 17, 2024, 7:41 PM IST
Laksha Pushparchana Puja in Yadadri : ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అమ్మవారులకు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. సుమారు గంట పాటు, ప్రధాన ఆలయ ముఖమండపంలో లక్ష పుష్పార్చన పూజలు, పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఆలయ అర్చకులు వేదపండితుల, వేద మంత్రోచ్ఛారణ, సన్నాయి మేళం నడుమ ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు, విశిష్టతను తెలియజేశారు.
Devotees Increase in Yadadri : వరుస సెలవులు రావటంతో భక్తులు అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులతో కలసి యాదాద్రికి తరలివచ్చారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావటంతో ఆలయ పరిసరాలలో సందడి నెలకొంది. ఆలయంలో వివిధ ఆర్జిత పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో, ధర్మదర్శనం మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటలు సమయం పట్టిందని ఆలయ అధికారులు తెలిపారు.