ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో ప్రాంభమైన అడ్మిషన్ల ప్రక్రియ- కనీస సౌకర్యాలు లేవని తల్లిదండ్రుల మండిపాటు - Nujiveedu IIIT College - NUJIVEEDU IIIT COLLEGE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 22, 2024, 3:26 PM IST
Lack of Facilities in Admissions Counseling in Nujiveedu IIIT College : ఏలూరు జిల్లా నూజివీడు, కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ కళాశాల్లో అడ్మిషన్ల కౌన్సింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఇవాళ, రేపు ఎంపికైన విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుందని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా తెలిపారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఈ నెల 24, 25 వ తేదీలలో ఆర్కే వ్యాలీలో అడ్మిషన్ ప్రక్రియ ఉంటుందని తెలిపారు
కౌన్సింగ్కు హజరై వారికి కనీస అవసరాలు ఏర్పాటు చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్మిషన్ల కోసం కౌన్సింగ్ నిర్వహించారు కానీ కనీసం కూర్చోవడానికి ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. దీంతో విద్యార్దులు, వారి తల్లిదండ్రులు నేలపైనే కూర్చువాల్సి వచ్చింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆర్జీయూకేటీ క్యాంపస్లో ఇలాంటి దుస్థితి ఏమిటని విద్యావేత్తలు, పలు ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అవసరమైన ధ్రువపత్రాలను జిరాక్స్ తీసుకోవడానికి ఒక్క షాపుకు కూడా అనుమతులు ఇవ్వకపోవడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.