LIVE : తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ మీడియా సమావేశం - KTR PRESS MEET
🎬 Watch Now: Feature Video
Published : Oct 21, 2024, 4:12 PM IST
|Updated : Oct 21, 2024, 4:34 PM IST
KTR Press Meet : గ్రూప్-1 పరీక్షలు రద్దుచేయాలంటూ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా పరీక్షలు నిర్వహిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ గ్రూప్-1 అభ్యర్తులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరని విమర్శించారు. మూడు రోజులుగా అభ్యర్థులు దర్నా చేస్తున్నా రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను కలిశామని 300 యూనిట్లు దాటితే ప్రస్తుతం యూనిట్‌కు రూ.10 వసూలు చేస్తున్నారని విమర్శించారు.జీవో నెంబర్ 29 రద్దుచేసి పాత పద్ధతిలోనే జీఓ నెంబర్ 55ను యధావిధిగా కొనసాగించాలని నినదించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకి తరలించారు. గ్రూప్-1పై ఉన్న కేసులన్నీ తొలగిన తర్వాతే మెయిన్స్ పరీక్ష నిర్వహించకపోతే తాము తీవ్రఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థులు అన్నారు. మరికొందరు అభ్యర్థులు రాత్రి 9 గంటల సమయంలో అశోక్‌నగర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు.
Last Updated : Oct 21, 2024, 4:34 PM IST