LIVE : తెలంగాణ భవన్‌లో మూసీ నదిపై కేటీఆర్ ప్రజెంటేషన్ - KTR PRESENTATION ON MUSI RIVER
🎬 Watch Now: Feature Video
Published : Oct 18, 2024, 4:03 PM IST
|Updated : Oct 18, 2024, 5:32 PM IST
KTR Power Point Presentation On Musi River Live : తెలంగాణ భవన్‌లో మూసీ నదిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. మూసీ ప్రాజెక్ట్‌తోనే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందన్న వారు తెలుసుకోవాల్సింది చాలా ఉందని కొన్ని అంశాలను లేవనెత్తారు. మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్‌లో నిలిచిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ తనకు అంటిన బురదనే అందరికీ అంటించాలని చూసే రకం అని ఆరోపించారు. పాలన చేతగాక పనికిరాని మాటలు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఆయన ఆరోపించారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు మూసీ మురుగులో కాంగ్రెస్ పొర్లుతోందన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో ఒక్క ఇళ్లు కూల్చినా తాము సహించేది లేదని హెచ్చరించారు. బుల్డోజర్లకు తమ పార్టీ కార్యకర్తలు అడ్డుగా ఉంటారని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తమకు నచ్చిన విధంగా ఇష్టారాజ్యాంగా ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే తమ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. పేదల కడుపు కొట్టి పెద్దలకు ఇచ్చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజంగా ఉందని ఆరోపించారు. కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి.
Last Updated : Oct 18, 2024, 5:32 PM IST