LIVE : బీజేపీ కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియా సమావేశం - Kishan Reddy Press Meet Live - KISHAN REDDY PRESS MEET LIVE
🎬 Watch Now: Feature Video
Published : May 11, 2024, 1:27 PM IST
|Updated : May 11, 2024, 1:43 PM IST
Kishan Reddy Press Meet Live : రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం 'కేసీఆర్ మాదిరిగానే రేవంత్‌రెడ్డి ప్రమాదకారి. అధికారం కోసం కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఎంతకైనా తెగిస్తారు. అబద్ధాలు ఆడడంలో ఇద్దరు నాయకులు ఆరితేరారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ఇంటి పేరుగా మార్చుకుంది.అబద్ధాలతో కాంగ్రెస్ 70 ఏళ్లుగా రాజకీయాలు చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్స్ గురించి వాస్తవాలు అడిగే స్థాయికి దిగజారారు. భద్రతా బలగాలపై కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ నమ్మకం లేదు. భద్రతా బలగాలను కాంగ్రెస్ నేతలు అవమానపరిచారు. పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయి అణిగిమణిగి ఉండాలని చెబుతున్నారు. పాక్‌కు అణిగిమణిగి ఉండే అలవాటు కాంగ్రెస్‌కు ఉంది. పాక్ దౌర్జన్యాలను 67 ఏళ్లు బరించారు. పాక్ దాడులను పూర్తిగా భారత్ పూర్తిగా నిలువరించింది. పాక్ తోకను పూర్తిగా కత్తిరించి నడ్డివిరిచాం. కాంగ్రెస్ అసమర్ధత కారణంగా పాక్‌కు అడ్డుకట్ట వేయలేకపోయారు' ఆయన మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నారు.
Last Updated : May 11, 2024, 1:43 PM IST