LIVE : సిరిసిల్లలో కేసీఆర్ మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - KCR on Dry Crops - KCR ON DRY CROPS
🎬 Watch Now: Feature Video
Published : Apr 5, 2024, 1:09 PM IST
|Updated : Apr 5, 2024, 7:06 PM IST
KCR Polam Bata Live : రాష్ట్రంలో సాగు నీరు అందక ఎండుతున్న పంటలను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే జనగామ, సూర్యాపేట జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వెంటనే వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తాజాగా కేసీఆర్ ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎండిపోయిన పంటలను అడుగంటిన జలాశయాలను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ గ్రామీణ మండలం ముగ్దుంపూర్ గ్రామంలో ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతుల కష్టాలను అడిగి ఆయన తెలుసుకుంటున్నారు. మధ్యాహ్నం మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో కేసీఆర్ భోజనం చేశారు. ప్రస్తుతం బోయినపల్లిలో ఎండిన పంట పొలాలను పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత కరీంనగర్‌తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ పర్యటించనున్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో ఎండిన వరి పొలాలను పరిశీలించి శెభాష్‌పల్లి బ్రిడ్జి వద్ద మధ్యమానేరు ప్రాజెక్టును సందర్శించారు. ప్రస్తుతం సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు.
Last Updated : Apr 5, 2024, 7:06 PM IST