ఉప్పొంగిన కట్టలేరు- వంతెనమీదుగా రాకపోకలు నిలిపివేత - Kattaleru Vagu Over flowing

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 31, 2024, 12:44 PM IST

thumbnail
ఉప్పొంగిన కట్టలేరు- వంతెనమీదుగా రాకపోకలు నిలిపివేత (ETV Bharat)

Kattaleru Vagu Over flowing With Flood Water in NTR District : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్​ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని కట్టలేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. గంపలగూడెం మండలం వినగడప సమీపంలోని కట్టలేరు వంతెనపై భారీగా వరద చేరింది. దీంతో రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తమైన వంతెనపై రాకపోకలు నిలిపేశారు.

కట్టలేరు వాగు ఉగ్రరూపం దాల్చి ప్రవహిచడంతో ఆంధ్రా - తెలంగాణ సరిహద్దులోని 100 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఆయా గ్రామాలకు వెళ్లాలంటే 30 కిలోమీటర్లు మేర చుట్టూ తిరిగి గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత రెండు రోజులుగా కట్టలేరు వంతెనపై వరద ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. వరద వచ్చిన ప్రతిసారీ రాకపోకలు నిలిచిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టలేరుపై కొత్త వంతెన నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.