వైఎస్సార్సీపీ నేతలు కాపులను వేధిస్తున్నారు: కాపు కార్పోరేషన్ డైరెక్టర్ - YSRCP Leaders Targeting kapu

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 1:47 PM IST

Kapu Leaders Resign to YSRCP: వైఎస్సార్సీపీ పదవులకు, పార్టీ సభ్యత్వానికి కాపు నేతలు గురువారం రాజీనామాలు (Resign) చేశారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలు కాపులనే టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని కాపు కార్పోరేషన్ డైరెక్టర్ లేళ్ళ వెంకట్రావు (Kapu Corporation Director) ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు (MLA Nambur Shankar Rao), అతని అనుచరుల వేధింపులకు పాల్పడుతున్నారని అందుకు నిరసనగా రాజీనామాలు చేస్తున్నామని వెంకట్రావు పేర్కొన్నారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

YSRCP Leaders Targeting kapu: కాపుల మనోభావాలను దెబ్బతీస్తూ, కించపరిచేలా మాట్లాడి, దాడులు, కేసులు (Illegal Cases) బనాయిస్తూ ఎమ్మెల్యే భయాందోళనలకు గురి చేస్తున్నారని వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతల దాడుల (Attack)పై హైకమాండ్ తగిన చర్యలు తీసుకుంటుందని ఇప్పటి వరకూ చూసామని ఇప్పటికీ స్పందించకపోవటంతో రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నామని  వెంకట్రావు పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.