ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు, పవన్, మంత్రులకు నా శుభాకాంక్షలు - మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ - Kamineni Srinivas - KAMINENI SRINIVAS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-06-2024/640-480-21692262-thumbnail-16x9-kamineni-srinivas.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 12, 2024, 11:52 AM IST
Kamineni Srinivas Away from Taking Oath Due to Illness : అనారోగ్యం కారణంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నట్లు మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. వైద్యులు నాలుగు రోజులు విశ్రాంతి అవసరమని సూచించినట్లు తెలిపారు. అభిమానులు, ప్రజలు ఎవ్వరూ హైదరాబాద్ రావద్దని ఆరోగ్యం కుదుటపడిన తరువాత తానే నియోజకవర్గ ప్రజల్ని కలుస్తానని అన్నారు. అనంతరం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలను కలుస్తానని వీడియో రూపంలో సమాచారం అందించారు. ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు, పవన్, మంత్రులందరికి శుభాకాంక్షలు తెలిపారు
" నాకు నాలుగురోజుల క్రితం సీవియర్ బాడీ ఇన్ఫెక్షన్, మైల్డ్ కొవిడ్ కారణంగా ఆసుప్రతిల్లో చికిత్స పొందుతున్నాను. డాక్టర్ నాలుగు రోజుల పాటు రెస్ట్ తీసుకోమని సలహ ఇచ్చారు. అందుకే నేను ప్రమాణ స్వీకరోత్సవానికి రాలేక పోతున్నాను. ఎన్డీఏ తరపున ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, మంత్రులందరికి పేరుపేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మోదీ సహకారంతో ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను " _కామినేని శ్రీనివాస్, మాజీమంత్రి