సీఎం జగన్ ఓడిపోవడానికి, పారిపోవడానికి సిద్ధంగా ఉండాలి: కాలవ శ్రీనివాసులు - కాలవ శ్రీనివాసులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 24, 2024, 10:20 PM IST
TDP will win 165 seats: తెలుగుదేశం-జనసేన కూటమి 165 స్థానాల్లో విజయం సాధిస్తుందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. మొదటి విడతలో రాయదుర్గం అభ్యర్థిగా కాలవ శ్రీనివాసులును ప్రకటించడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావలసిన చారిత్రాత్మక అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజలంతా మహాకూటమికి ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. జగన్ సిద్ధం సభలు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ లాగ ఉన్నాయని కాలవ ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ ఓడిపోవడానికి, పారిపోవడానికి సిద్ధంగా ఉండాలని కాలవ శ్రీనివాసులు సూచించారు. టీడీపీ-జనసేన కూటమి అధికారంలో వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు దోహదపడుతుందని కాలవ పేర్కొన్నారు. రాయదుర్గం టికెట్ కేటాయించినందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్‌కు కాలవ శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.