సంప్రదాయ దుస్తులకు పాశ్చాత్య సొబగులు- తిరుపతిలో కళాంజలి ఫ్యాషన్ షో అదుర్స్ - PG Students Kalanjali Fashion Show - PG STUDENTS KALANJALI FASHION SHOW
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 23, 2024, 12:34 PM IST
Kalanjali Fashion Show at SV Vaidya College in Tirupati: తిరుపతిలో నిర్వహించిన అద్భుత వస్త్ర ప్రపంచం కళాంజలి ఫ్యాషన్‌షో హుషారు రేకెత్తించింది. శ్రీవేంకటేశ్వర వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన సినాప్స్ పీజీ ఫెస్ట్ 24 కార్యక్రమం నగరవాసులను, విద్యార్థులను ఆకట్టుకుంది. భారతీయ సంప్రదాయాలు ప్రతిబింబించేలా యువతరం అభిరుచులు, జీవనశైలి, ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఈ ఫ్యాషన్ షో కొనసాగింది. కళాంజలి వస్త్రాలు ధరించిన యువతి, యువకులు వేదికపై హొయలొలికించారు. సంప్రదాయ దుస్తులతో పాటు పాశ్చాత్య డిజైన్లను విద్యార్థులు ధరించి ర్యాంప్ వాక్ చేశారు.
విద్యార్థినులు సంప్రదాయ పట్టు వస్త్రాలు, మోడ్రన్ డ్రెస్సులు, చుడీదార్లు, గౌన్లు ధరించి చేసిన ఫ్యాషన్ వాక్ అక్కడ ఉన్న అందరినీ ఆకర్షించింది. వైద్య వృత్తితో నిత్యం ఒత్తిడిగా ఉండే పీజీ వైద్యులు కళాంజలి కాంతులతో జరిపిన ఆనందోత్సవాలతో ఆడిటోరియం మార్మోగింది. యువత మన సంప్రదాయాలు మర్చిపోకుండా కళాంజలి వస్త్రాలు నూతన ఒరవడిని సృష్టించింది. అదరహో అనిపించేలా సాగిన ఈ ప్రదర్శనను విద్యార్థులు కళ్లార్పకుండా తిలకించారు. ఈలలు, కేకలు వేస్తూ వైద్య విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.