ఎన్నికల అధికారులను బెదిరిస్తున్న కాకాణి - ఈసీ కేసు నమోదు చేయాలి: టీడీపీ నేతలు - beeda ravichandra on Kakani - BEEDA RAVICHANDRA ON KAKANI
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 29, 2024, 12:35 PM IST
Kakani Govardhan Reddy is Threatening Election Officers? : తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కేసులు నమోదు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పొదలకూరు, సర్వేపల్లిలో విచ్చలవిడిగా మంత్రి నగదు పంపిణీ చేశారని ఆరోపించారు. ఎన్నికల అధికారులను మంత్రి బెదిరిస్తున్నారని చెప్పారు.
ఉద్యోగులు సక్రమంగా పని చేయడం లేదని కాకాణి ఇప్పుడు చెబుతున్న మాటలను, తాము ఎప్పటినుంచో చెబుతున్నామని బీద రవిచంద్ర గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చాలామంది ఉద్యోగులు ఉద్యోగాలు చేయడం మరిచిపోయారని, ఐఏఎస్ అధికారులు సైతం అధికార నాయకుల అనుమతి తీసుకుని పని చేసే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. కాకాణిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈనెల 18వ తేదీన ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. ఆయనపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ సోమిరెడ్డి మానవతా దృక్పథంతో ఎస్టీ కుటుంబానికి సహాయం చేస్తే కేసులు పెట్టడం దారుణమని విమర్శించారు.