'సమస్యలు పరిష్కరించటంలో అధికారులు విఫలం' - రెండో రోజూ కొనసాగుతున్న జూడాల సమ్మె - JUDAs Strike Continues Second Day
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 13, 2024, 5:08 PM IST
Junior Doctors Strike Continues Second Day at Vijayawada Govt Hospital: డిమాండ్ల సాధన కోసం రెండో రోజు జూనియర్ డాక్టర్లు మెరుపు సమ్మెకు దిగారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట వర్షంలోనూ జూడాలు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించటంలో అధికారులు విఫలమయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో అత్యవసర విభాగ సేవలు మినహా విధులను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. ఇప్పటికైన అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దాడులను నిరసిస్తూ జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు. నిన్న ఓ రోగి బంధువులు తమపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి పురుగుల మందు తాగి చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారని తెలిపారు. చికిత్స చేసే సమయంలో రోగి మరణించగా వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ మృతుని బంధువులు దాడికి దిగారని వాపోయారు. డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్లనూ అసభ్యకరంగా దూషించారని నిరసన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.