కాపులంతా జనసేన వైపే ఉన్నారు- టిక్కెట్టు ఇచ్చినా, ఇవ్వకపోయినా కూటమి వెంటే ఉంటా! : ఆమంచి స్వాములు - పవన్ కళ్యాణ్​పై విమర్శలు దారుణం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 3, 2024, 6:35 PM IST

JSP Leader Swamulu Said Criticizing is Outrageous Pawan Kalyan: కాపులంతా జనసేన వైపే ఉన్నారని బాపట్లజిల్లా చీరాల నియోజకవర్గ జనసేన ఇన్ చార్జి ఆమంచి స్వాములు అన్నారు. పందిళ్ళపల్లి లోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. కాపులంతా పవన్ కళ్యణ్ వెంటే ఉన్నారని,మొదటినుండి కాపుల రాజ్యాధికారం కోసం పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారని ఆయనే పేర్కొన్నారు. అధికార పార్టీ కుట్రలో పడి, సొంత కులం వారే పవన్‌ కల్యాణ్‌ను విమర్శించడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  రానున్న రోజుల్లో తెలుగుదేశం- జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలని ఆమంచి కోరారు. చంద్రబాబు, పవన్‌పై కింది స్థాయి నేతలు  ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటం సరికాదని ఆయన సూచించారు. తమకు టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూటమి కోసం పనిచేస్తానని ఆమంచి తెలిపారు. జనసేన పార్టీ, కాపు సంక్షేమ సంఘాన్ని వైసీపీ నేతలు ఏమి చేయలేరని ఆమంచి వెల్లడించారు.

నీతి నిజాయితీకి మారు పేరు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో మంచి వెలుగు తెచ్చేందుకు ఆయనపడే కష్టాన్ని గుర్తించకుండా విమర్శించడం అనేది చాలా దారుణం. జనసేన -తెలుగుదేశం పార్టీల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.-ఆమంచి స్వాములు, జనసేన నేత.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.