కంపెనీ నిర్మించకుంటే మా భూములు తిరిగివ్వండి - జిందాల్ భూ నిర్వాసితుల ఆందోళన - విజయనగరం భూ నిర్వాసితుల దీక్ష
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 26, 2024, 5:55 PM IST
Jindal Land Dwellers Protest in Vizianagaram: విజయనగరం కలెక్టరేట్ వద్ద జిందాల్ భూ నిర్వాసితులు (Jindal Land Dwellers) ఆందోళనకు దిగారు. ప్రభుత్వం 15 ఏళ్ల క్రితం రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని ఇప్పటికీ కంపెనీ ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ పెట్టే ఆలోచన లేకుంటే తమ భూములు తిరిగి తమకు అప్పగిస్తే సాగు చేసుకుంటామన్నారు. ఒకవేళ కంపెనీ ఏర్పాటు చేస్తే తమ భూములకు ఇప్పటి ధర ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ (Demand) చేశారు. డిమాండ్లు పరిష్కరించకుంటే నిరాహార దీక్షకు దిగుతామని ప్రకటించారు.
Jindal Bhu Nirvasithula Strike : భూములు తీసుకొని ఏళ్లు గడుస్తున్నా కంపెనీలు ఏర్పాటు చేయలేదని రైతన్నలు (Farmers) ఆవేదన చెందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టాలు లేని సాగుదారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. కంపెనీ షేర్లు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కంపెనీ షేర్లను పెంచాలన్నారు.