'ఫిబ్రవరి నుంచి పవన్ కల్యాణ్ ప్రజల్లోనే' - రోజుకు మూడు సభల్లో పాల్గొంటారు : నాదెండ్ల - Nadendla Manohar
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 21, 2024, 8:01 PM IST
Janasena Party Preparing to Win Elections: వచ్చే సార్వత్రిక ఎన్నికలలో సత్తా చాటేందుకు జనసేన పార్టీ సన్నద్ధమవుతోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజల్లోనే ఉంటారని దానికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రతిరోజు హెలికాప్టర్ ద్వారా మూడు సభలలో పవన్ కల్యాణ్ పాల్గొంటారని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
రానున్న ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించేందుకు ప్రాంతాల వారీగా జనసేన పార్టీ 191 మందితో ఎన్నికల ప్రచార కమిటీని ఇటీవలే నియమించింది. ఈ బృంద సభ్యులతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మనోహర్ సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు ఈ సభ్యులు ఎంతో కీలకమన్నారు. రాబోయే రెండు నెలలు పార్టీ విజయం కోసం ఎంతో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మేలు చేకూరేలా ఉమ్మడి మానిఫెస్టోను రూపొందిస్తున్నామని మనోహర్ తెలిపారు. జనసేన పార్టీ పోటీ చేయడానికి కావలసిన సీట్ల విషయం పవన్ కల్యాణ్, చంద్రబాబు చూసుకుంటారని మనోహర్ వెల్లడించారు.