హెలికాప్టర్​లో సాంకేతిక సమస్య- పర్యటన వాయిదా వేసుకున్న పవన్ - Helicopter Technical Issue - HELICOPTER TECHNICAL ISSUE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 22, 2024, 10:32 PM IST

 Pawan Kalyan Helicopter Technical Issue:  జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Party Chief Pawan Kalyan) ఎన్నికల ప్రచారానికి అవాంతరం ఏర్పడింది. నేడు పవన్ కల్యాణ్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లో సాంకేతికత సమస్యలు తలెత్తాయి. పవన్ హెలికాప్టర్ లో కూర్చొన్న తరవాత టేకాఫ్ సమయంలో ఇంజిన్ లో సమస్య తలెత్తినట్లు పైలెట్ గుర్తించారు. దీంతో పవన్ పర్యటన వాయిదా పడింది. పిఠాపురం నియోజక వర్గం నుంచి తాడేపల్లిగూడెం సభకు రావల్సిఉండగా ఈ అవాంతరం ఏర్పడింది. ఫలితంగా తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా వేసినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. ఆ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన సభలను మరో రోజు నిర్వహిస్తామని పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.  అయితే, పవన్ రాక కోసం ఎదురు చూసిన జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు తీవ్ర నిరాశాకు గురయ్యారు. తమ అభిమాను నేత ప్రసంగాన్ని ప్రత్యేక్షంగా చూడాలని ఎంతగానో ఆశపడితే హెలికాప్టర్​లో సమస్యతో, ఆశలు అడియాశయ్యాయని కార్యకర్తలు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.