వైసీపీ నేతల వేధింపులు - విద్యుత్ టవర్ ఎక్కి జనసేన నేత నిరసన - Janasena Leader Protest

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 7:15 PM IST

Janasena Leader Protest by Climbing Electricity Tower: వైసీపీ నేతల వేధింపులు తాళలేక జనసేన పార్టీ విజయవాడ నగర సంయుక్త కార్యదర్శి పాలవలస కోటేశ్వరరావు మొగల్​రాజ్​పురం మధు గార్డెన్ వద్ద ఉన్న విద్యుత్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు అక్కడకు చేరుకుని విద్యుత్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. విద్యుత్ శాఖ సిబ్బంది వచ్చి విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. దాదాపు 2గంటల పాటు కోటేశ్వరరావు విద్యుత్ టవర్ పైనే నిరసన తెలిపారు. కోటేశ్వరరావును కిందకి దింపేందుకు అగ్నిమాపక సిబ్బందిని కూడా రంగంలోకి దించారు. వారు విద్యుత్ టవర్ చుట్టూ వల పన్నారు. చివరికి పోలీసులు నచ్చజెప్పడంతో కోటేశ్వరావు కిందకు దిగారు.

ఎన్నికల ముందు కొండ ప్రాంత వాసులకు ఇళ్ల పట్టాలు ఇస్తామని అధికార పార్టీ నాయకులు హామీ ఇచ్చారని, అయితే ఇంత వరకూ నెరవేర్చలేదని కోటేశ్వరరావు మండిపడ్డారు. ఈ సమస్యపై గత కొన్ని నెలల నుంచి ఆందోళన చేసట్టామని అప్పటి నుంచి వైసీపీ నేతలు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యకం చేశారు. మంగళవారం రాత్రి కూడా కొంత మంది వైసీపీ నాయకులు తమ ఇంటికొచ్చి అసభ్యంగా మాట్లాడి, దాడి చేయడానికి యత్నించారని తెలియజేశారు. సమస్యలపై ప్రశ్నిస్తే ఇలా దాడులకు తెగబడతారా? అని జగన్ ప్రభుత్వాన్ని పాలవలస కోటేశ్వరరావు ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.