అన్నదాతలకు ఏ కష్టమొచ్చినా తక్షణమే ఆదుకుంటాం: సీఎం జగన్ - ఏపీలో అన్నదాతలకు ఇన్‌పుట్ సబ్సిడీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 6, 2024, 7:19 PM IST
Jagan Distributes Input Subsidy to Farmers Tadepalli : రైతులను చేయి పట్టుకుని నడిపిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గతేడాది ఖరీఫ్ వర్షాభావం వల్ల నష్టపోయిన వారికి, అదే విధంగా మిగ్‌జాం తుపానుతో సర్వం కోల్పోయిన అన్నదాతలకు ఇన్‌పుట్ సబ్సిడీ (Input Subsidy) నిధులు విడుదల చేశారు. మొత్తం 11లక్షల 60 వేల మంది రైతుల ఖాతాల్లో 12వందల 95 కోట్ల పరిహారాన్ని తాడేపల్లి (Tadepalli) నుంచి బటన్ నొక్కి జమ చేశారు. అన్నదాతలకు ఏ కష్టమొచ్చినా తక్షణమే ఆదుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.
CM Release Input Subsidy Funds : తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం జగన్ నిధులు విడుదల చేశారు. గతేడాది ఖరీఫ్ లో కరవు, సహా రబీలో మిచాన్ తుపాను వల్ల నష్టపోయిన వ్యవసాయ ఉద్యాన వన రైతులకు (Farmers) పంటనష్ట పరిహారాన్ని రైతుల ఖాతాలో జమ చేశారు.