'గీతాంజలి మృతిపై వైసీపీ అసత్య ప్రచారాలు' - ఐటీడీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 13, 2024, 3:49 PM IST
ITDP Leaders Protest on Geetanjali Murder Issue: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఐటీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు నిరసన ప్రదర్శన చేశారు. గీతాంజలి మృతి (Geetanjali Murder Case)ని అడ్డుపెట్టుకుని వైసీపీ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీపై అసత్య ప్రచారాలు చేయటాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక గాంధీ సెంటర్లో ధర్నా చేపట్టారు. శవరాజకీయాలకు అలవాటుపడిన సీఎం జగన్ (CM Jagan) గీతాంజలి మృతిపై విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వానికి, నందిగామ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు సోదరులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
"గీతాంజలి మృతిని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీపై విషప్రచారం చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారు. శవరాజకీయాలు చేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు. ఈ నెల ఏడో తారీఖున గీతాంజలి రైలు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చేరితే మిన్నకుండిన ప్రభుత్వం ఆమె చనిపోయాక శవరాజకీయాలకు తెరలేపారు." - ఐటీడీపీ నేతలు