సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్స్ మార్గాన్ని ఎంచుకున్న : 173వ ర్యాంకర్ ధీరజ్ రెడ్డి - 173rd Ranker Dheeraj Interview - 173RD RANKER DHEERAJ INTERVIEW
🎬 Watch Now: Feature Video


Published : Apr 16, 2024, 7:45 PM IST
Interview with UPSC 173rd Ranker Dheeraj Reddy : తన తండ్రి పని చేసే విద్యా సంస్థలో మధ్యాహ్న భోజనం కోసం పేద పిల్లలు పడే ఇబ్బంది చూసి చాలించారు. సివిల్స్ సాధించి అలాంటి వారికి సేవ చేయవచ్చనే లక్ష్యంతో సివిల్స్‌లో 4వ ప్రయత్నంలో 173వ ర్యాంకు సాధించానని అంటున్నారు ధీరజ్ రెడ్డి. నల్గొండ జిల్లా అల్వాల గ్రామానికి చెందిన ధీరజ్ తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. రెగ్యులర్ డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఆయన, డిస్టెన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
Civils Ranker Dheeraj Reddy about Preparation : గత ఐదు సంవత్సరాలుగా సన్నద్ధతమవుతున్నానని, సివిల్స్ ప్రిపరేషన్ నిరంతరం సాగుతూ ఉంటుందని ధీరజ్ రెడ్డి చెప్పారు. అయితే ఒకసారి రాస్తే వచ్చే అనుభవంతో సివిల్స్ ఎలా సన్నద్ధమవ్వాలో తెలుస్తుందన్నారు. గ్రాడ్యుయేషన్ టైంలోనే సివిల్స్ మార్గాన్ని ఎంచుకున్నానని, తండ్రిని ఆదర్శంగా తీసుకున్నానని తెలిపారు. లైఫ్‌లో ఏం చేయలన్నా మన మీద మనకు నమ్మకం ఉండాలని, దాని కోసం ధైర్యంగా ఉండాలంటున్న సివిల్స్ విజేత ధీరజ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.