నకిలీ వైద్యుల కట్టడికి ప్రభుత్వమే సహకరించాలి: డాక్టర్ శ్రీనివాస్ - TSMC Vice President Interview - TSMC VICE PRESIDENT INTERVIEW
🎬 Watch Now: Feature Video
Published : May 17, 2024, 7:06 PM IST
Interview with TSMC Vice President Dr. Srinivas : తినే ఆహారం మొదలు తాగేనీరు, పీల్చే గాలి వరకు ఇప్పుడు అంతటా కల్తీ మయం. అందుకే రోజు రోజుకీ కొత్త వ్యాధులు వెలుగు చూస్తున్నాయి. ప్రజలు సంపాదనలో అధిక భాగం ఆస్పత్రులకే చెల్లించాల్సిన దుస్థితి. మరి రోగులను కాపాడే వైద్యుల్లోనూ నకిలీలు ఉంటే? సరైన అర్హత లేకుండా చికిత్స అందించి ప్రాణాలు పోయాల్సిన వారే ఉసురు తీస్తే?
వైద్య వృత్తే ప్రమాదంలో పడే దుస్థితి వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో నకిలీ వైద్యుల కట్టడిలో తనవంతు పాత్ర పోషిస్తోంది తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి. రోజు రోజుకు పెరుగుతున్న నకిలీ వైద్యుల కట్టడికి ప్రభుత్వం సహకరించాలని టీఎస్ఎమ్సీ ఉపాధ్యక్షుడు కోరారు. ఎప్పటికప్పుడు ఆస్పత్రులు, క్లినిక్ లను సందర్శించి నకిలీ వైద్యులకు నోటీసులు జారీ చేయటమే కాకుండా పోలీసు శాఖ సహకారంతో కేసులు నమోదు చేయిస్తోంది. ఈ నేపథ్యంలో నకిలీ వైద్యుల కట్టడిపై టీఎస్ఎమ్సీ ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.