ఎముకల్లో పటుత్వం కోసం వ్యాయామం తప్పనిసరి: డాక్టర్ రమణమూర్తి - Dr Ramanamurthy Interview - DR RAMANAMURTHY INTERVIEW
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 4, 2024, 3:03 PM IST
Interview With Orthopedic Specialist Ramana Murthy : ఎముకల్లో పటుత్వం లోపించడం ప్రధానంగా జీవన శైలి, ఆహారపు అలవాట్లతో పాటు పలు అంశాలు కారణం అవుతున్నాయని ప్రముఖ ఎముకలు వైద్య నిపుణుడు డాక్టర్ రమణమూర్తి అన్నారు. దీనిని అధిగమించేందుకు క్రమం తప్పని వ్యాయామం, ఇతర అంశాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అఖిల భారత వైద్యుల సంఘం ప్రతి సంవత్సరం ఆగస్టు 4న ఎముకలు జాయింట్ల డే గా పాటిస్తోందని ఆయన వివరించారు.
ఎముకలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందనే ప్రత్యేకతతో ఈ జాయింట్ డే జరుపుకుంటున్నామని రమణమూర్తి పేర్కొన్నారు. ఎముకలు బలంగా ఉండేందుకు సరైన పండ్లు, ఆకుకూరలు వంటి పోషకాహారాలను తీసుకోవాలని రమణమూర్తి సూచించారు. అదే విధంగా బయట తిరుగుతున్నప్పుడు సూర్య కిరణాలు మన మీద పడితే శరీరంలో క్యాలుషియం పెరిగి ఎముకలు ధృడం అవుతాయని వెల్లడించారు. ఎముకల ప్రాధాన్యం ప్రతి ఒక్కరూ అవగతం చేసుకోవడం ద్వారా ఎక్కువ కాలం ఎముకలకు సంబంధించి ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చని రమణ మూర్తి చెబుతున్నారు.